మంచాన్ని ఇలా వాడితే దరిద్రం పట్టుకుంటుంది…

మనలో చాలామంది తెలిసో, తెలియకో, పోరపాటుగానో కొన్ని పనులు చేస్తారు, వాటి వలన ఐశ్వరం ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. కొంతమంది రాత్రి పడుకునే ముందు దేవుడి పుస్తకాలను చదువుకుని వాటిని తలగడ క్రింద పెట్టుకుని పడుకుంటారు. అంతేకాకుండా దేవుడి ఫొటోలను, దేవుడి బిళ్లలను కూడా తలక్రింద పెట్టుకుంటారు.

అలా తలగడ క్రింద పెట్టుకుని పడుకుని, ప్రొద్దున్న లేవగానే వాటిని తీసి కళ్ళకద్దుకుంటారు. ఇది చాలా తప్పుడు పని, మంచం ఎప్పుడూ కూడా యోగ,భోగ స్థానమే గాని అది  ఐశ్వర్య స్థానం, దైవ స్థానం అవ్వదు. అటువంటి మంచం మీద దేవుడికి సంబందించిన పుస్తకాలను గాని, ఫోటోలను గాని ఎత్తి పరిస్థితుల్లో పెట్టకూడదు.

ఇంకా పసుపు కుంకుమ, పూజా సామాను తమలపాకులు, పూలు, పళ్లు, దేవతలకు నైవేద్యం పెట్టడం కోసం తెచ్చుకున్న పదార్థాలను కూడా ఎట్టి పరిస్థితుల్లో మంచం మీద పెట్టకూడదు. భోగ స్థానం అయిన మంచం పై ఇలాంటివి పెడితే… ఆ ఇంట్లో లక్ష్మి నిలువదు…

Follow by Email
Facebook
Facebook
Google+
http://namasthetelugu.com/news/%e0%b0%ae%e0%b0%82%e0%b0%9a%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%87%e0%b0%b2%e0%b0%be-%e0%b0%b5%e0%b0%be%e0%b0%a1%e0%b0%bf%e0%b0%a4%e0%b1%87-%e0%b0%a6%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a6/
Twitter

Leave a Reply

*