ఇలా చేస్తే మానసిక ప్రశాంతత పొందడం ఎంత సులభంటే…

మానసిక ప్రశాంతత ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎందులో పొందచ్చు, ఎవరి ద్వారా పొందచ్చు ఇలా అనేకమైన ఆలోచనలతో ఆరా తీస్తూనే, జీవితాన్ని సాగిస్తారు చాలామంది. డబ్బుతోనూ, బందువులతోను, కుటుంబసభ్యులతోను, వినోదాలు, వేడుకలతోను అన్నిటితో ప్రయత్నిస్తారు కాని, చివరకు నాకు  ప్రశాంతత లేదు అంటారు మరికొందరు. మానసిక ప్రశాంతత అనేది బజారులో దొరికే వస్తువు కాదు అది కొనుక్కుంటేనో, అడిగితేనో వచ్చేది కాదు. అది మన మనసులోనే ఉంటుంది. మన ఆలోచనా విధానంలో ఉంటుంది. మనకు ప్రశాంతత లేదు అంటే, మనం మనకి నచ్చేలా లేమని అర్ధం, లేనిది ఎదో మనసు కోరుకుంటుందని అర్ధం. అందుకే మన మైండ్ సెట్ ని ముందు బెస్ట్ గా మార్చుకుంటే ఎ సమస్య ఉండదు. మానసిక ప్రశాంతత మీలోనే ఉందని, అది మీరు ఎలా పొందాలనేదానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఫాల్లో అయ్యిచూదండి.

  1. సింపుల్ గా ఉండండి. మీ మనసుకు ఏది ఇష్టమో అవి ధరించండి బట్ట అయిన వస్తువులైనా అంతే గాని అవతలి వారి కోసం, వాళ్ళ దగ్గర గొప్పలు కోసం చెయ్యకండి. మన కంటే గొప్ప వాళ్ళతో స్నేహం చేస్తే ఎదో గొప్ప అని వాళ్ళతో మాత్రమే చెయ్యకండి. మనతోటి వాళ్ళతో, మనకు సరిపడే మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో స్నేహం చెయ్యండి. సింప్లిసిటీతో జీవిస్తే మానసిక ప్రశాంతత ఈజీగా పొందవచ్చు.
  2. అహం అన్ని అనర్ధాలకు కారణం. అహం అనేది ఉంటె మానసిక ప్రశాంతత కోల్పోతాము.దాన్ని వెంటనే వదిలేయండి. అహానికి ఆత్మవిశ్వాసానికి తేడాను గమనించి అహాన్ని వదిలేయండి.
  3. ఎప్పుడో, ఎక్కడో ఎదో చెయ్యాలనే ఆలోచనల కంటే ముందు మనచుట్టూ ఉన్నవాటిని, మన మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చేలా తయారు చేసుకోండి. గాలి వెలుగు వచ్చేలా ఇంటిని పెట్టుకోండి.మన చుట్టూ ఉన్న వస్తువులను శుభ్రంగా కళ్ళకు మనసుకు ఆనందం కలిగేలా ఉంచుకోండి.
  4. గతాన్ని తవ్వుకోవడం మానేయండి. గతంలో బాగున్నాను ఇప్పుడు బాలేనని కృంగిపోకండి, అలగే గతంలో బాలేను ఇప్పుడు బాగున్నానని పొంగిపోకండి. భవిష్యత్తు మీద విపరీతమైన అంచనాలను వేసుకుని, వాటి గురించి ఇప్పటి జీవితంలో ప్రశాంతతని పోగొట్టుకోకండి. గతం వలన లాభం లేదు, భవిష్యత్తు మన చేతుల్లో, అంచనాలలో లేదు. అందుకని ఇప్పటి పనిని ఆనందగా, శ్రద్దగా చెయ్యండి.

కృతజ్ఞతా బావం ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. జీవితంలో పొందే ప్రతి చిన్న విషయానికి కృతజ్ఙత తెలపాలి. శ్వాస పొందడం నుంచి అన్ని బ్లెస్సింగే అని నమ్మాలి. మీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరిపైనా కృతజ్ఙతా భావం కలిగి ఉండాలి.

  1. మీరనుకున్నదే నిజమని, అదే కరెక్ట్ అని మొండితనానికి పోకుండా, ఇతరులు ఏమైనా చెబితే పరిస్థితులను బట్టి అది కరక్ట్ అని అనిపిస్తే, మన అభిప్రాయాన్ని ఆనందగా మార్చుకోవచ్చు.

6.కలిమి నిలువదు, లేమి గడవదు కలకాలం ఒక రీతి జరగదు అనేది గుర్తుంచుకోవాలి. భాదలు ఎల్లకాలం మనతో ఉండిపోవు. కాలం అన్ని సమస్యలకి పరిష్కారం చూపుతుంది. కస్టాలు వచ్చినప్పుడే మనం ఇంకొంచం స్ట్రాంగ్ గా ఉండాలి. కష్టాలు వలన మన జీవితంలో చాల నేర్చుకుంటాం.అందుకే చిన్నప్పుడు స్కూల్లో విద్య నేర్చుకునేటప్పుడు ఎంత ఆడుతూ పాడుతూ నేర్చుకోవడం వలన ఆ విద్య మనకు పెద్ద అయ్యిన తరవాత ఉపయోగ పడుతుంది. అలాగే కష్టాలలో నేర్చుకున్న గునపాటాలు సుఖాలకు దారి తీస్తాయి.

ఇది చదివి ఇప్పటికైనా ధైర్యంగా, తెలివిగా, సహనంగా జీవిస్తూ, మానసిక ప్రశాంతత ను పొందండి. తోటి వారిలో కూడా కాన్ఫిడెన్స్ ని నింపండి.

Follow by Email
Facebook
Facebook
Google+
http://namasthetelugu.com/uncategorized/%e0%b0%87%e0%b0%b2%e0%b0%be-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%87-%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b0%b8%e0%b0%bf%e0%b0%95-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b6%e0%b0%be%e0%b0%82/
Twitter

Leave a Reply

*